logo

జగన్‌ చిత్రాలపై ముసుగేదీ..?

మండలంలో కోడ్‌ ఉల్లంఘనల పరంపర కొనసాగుతూనే ఉంది. పుల్లూరు సచివాలయంపై వైఎస్‌ జగన్‌ చిత్రం స్పష్టంగా కనిపిస్తున్నా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలనాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

Published : 09 May 2024 04:55 IST

పుల్లూరు సచివాలయంపై కనిపిస్తున్న వైఎస్‌ జగన్‌ చిత్రం

ఖాజీపేట, న్యూస్‌టుడే: మండలంలో కోడ్‌ ఉల్లంఘనల పరంపర కొనసాగుతూనే ఉంది. పుల్లూరు సచివాలయంపై వైఎస్‌ జగన్‌ చిత్రం స్పష్టంగా కనిపిస్తున్నా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలనాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అరకొరగా తాత్కాలిక చర్యలు తీసుకొని చిత్రాలకు ముసుగులు వేసినప్పటికీ అవి చిరిగిపోయి తిరిగి దర్శనమిస్తున్నాయి. ఇలాంటి చిత్రాలను పూర్తి స్ధాయిలో కనిపించకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

వైకాపా కోడ్‌ ఉల్లంఘన చర్యలెక్కడా..?

పోరుమామిళ్ల, బద్వేలు: పోరుమామిళ్ల మండలంలోని బాలిరెడ్డిపల్లెలో బుధవారం రాత్రి వైకాపా నాయకులు సిద్ధం స్టిక్కర్లను ఊరంతా అతికించే కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్తు స్తంభాలకు, ఇంటి గోడలకు, ప్రహరీలకు జగన్‌ స్టిక్కర్లు అంటించారు. గ్రామాల్లో యథేచ్ఛగా వైకాపా నాయకులు కోడ్‌ ఉల్లంఘన చేపడుతున్నా అధికారులు విచారించి చర్యలు చేపట్టిన సందర్భాలు లేవు. మంగళవారం అట్లూరు మండలంలోని వేమలూరులో కూడా ఇదే తంతు కొనసాగింది.

ఇక్కడ కోడ్‌... వర్తించదా

ఎర్రగుంట్ల (ముద్దనూరు): మండలంలోని ఉప్పలూరు గ్రామంలో బస్టాండ్‌లో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దిమ్మెకు వైకాపా రంగులు అలాగే ఉన్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తమకు వర్తించదన్నట్లుగానే అధికారులు వ్యవహరిస్తూన్నారు, అధికార పార్టీ జెండా రంగులు కనిపిస్తున్నా అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

వాలంటీర్లు అతికించారు.. అధికారులు తొలగించారు

బి.కోడూరు, కాశినాయన: ఎన్నికల నియమావళిని వైకాపా నాయకులు, వాలంటీర్లు తుంగలో తొక్కుతున్నారు. మండలంలోని పిట్టిగుంట ఓబులాపురం గ్రామాల్లో బుధవారం సాయంత్రం నాయకులు వాలంటీర్లు కలిసి.. ఇంటింటికి వెళ్లి పేర్లు నమోదు చేసుకుంటూ, తమ ఇంటికి స్టిక్కర్లు అతికించవద్దని చెబుతున్నా జగనన్న చిత్రం ఉండే బొమ్మలను అతికించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు రాత్రి ఏడు గంటలకు గ్రామానికి వచ్చి స్లిక్కర్లను తొలగించారు. అతికించిన నాయకులు, వాలంటీర్లు అధికారులకు తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని