logo
Published : 30/11/2021 03:21 IST

గాంధీలో పోషకాహారానికి సెలవు!


గతంలో రోగులకు అందించిన ఆహారం

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి: కరోనా రోగులకు పోషకాహారం సరఫరా నిలిచిపోయింది. తెలంగాణ ప్రభుత్వ టీచింగ్‌ ఆస్పత్రుల్లో అందించే  కొవిడ్‌ డైట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ (డీఎంఈ) రమేష్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గాంధీలో ఈ ఆహారం నిలిచిపోయింది. తొలి, రెండో విడతల్లో గాంధీలో మొత్తం 50 వేల మంది చికిత్స పొందారు. ప్రస్తుతం 650 ఐసీయూ, 600 ఆక్సిజన్‌, 600 సాధారణ పడకలు ఉన్నాయి. మహమ్మారి ఉద్ధృతి సమయంలో మిగతా చికిత్సలు నిలిపివేసి కేవలం కరోనా రోగులకు సేవలు అందించారు. నిత్యం 200-250 మంది వైరస్‌తో చేరేవారు. ప్రస్తుతం పది మందిలోపే వస్తున్నారు. దీంతో సాధారణ సేవలు అందిస్తున్నారు. మహమ్మారి రోగులకు ప్రత్యేక ఆహారం అందించేవారు. తొలుత తీవ్ర అస్వస్థతతో చేరినా...కోలుకున్న తర్వాత ఈ ఆహారం ఎంతో ఉపయోగపడేది. రోగనిరోధక శక్తి పెంపులో ఇది కీలకం.  

మళ్లీ ఎప్పుడో...!
బాధితులు త్వరగా కోలుకునేందుకు, రోగనిరోధకశక్తి పెంపొందించేందుకు డ్రైఫ్రూట్స్‌, మాంసాహారం, పాలు, గుడ్లు, పండ్లతోపాటు మినరల్‌ వాటర్‌ అందించేవారు. వారికి త్వరగా స్వస్థత చేకూరేందుకు చికిత్సలు, మందులతోపాటు బలవర్ధకమైన ఆహారం ఎంతో అవసరం. గాంధీతోపాటు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఆహారం సరఫరా చేశారు. బలవర్ధకమైన ఆహారం కోసం వైరస్‌ బాధితులకు రోజుకు రూ.275, వైద్యులు, సిబ్బందికి రూ.300 కేటాయించారు. చికిత్స పొందుతున్న వారితోపాటు సేవలు అందించే వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందికి ఆయా ఆస్పత్రుల డైట్‌ కాంట్రాక్టర్‌ ద్వారా ఆహార పదార్థాలను అందించేవారు. సాధారణ రోగులకు అందించే డైట్‌ రోజుకు రూ.40 మాత్రమే. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో కరోనా బారినపడిన 35 మందికి, బ్లాక్‌ఫంగస్‌ సోకిన 16 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారికి..
కొవిడ్‌ డైట్‌ నిలిపివేయడంతో ప్రస్తుతం వారికి సాధారణ భోజనమే ఇస్తున్నారు. రుచి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న కొద్ది మందికైనా మంచి ఆహారం అందజేయాలని కోరుతున్నారు. ఒకవేళ కేసులు పెరిగితే ఎప్పటి మాదిరిగానే ప్రోటీన్‌ డైట్‌ అందించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని