logo
Published : 03/12/2021 01:15 IST

శవ రాజకీయాలు మానండి

ఎమ్మెల్యే రఘునందన్‌రావు
బాధిత కుటుంబానికి రూ.లక్ష సాయం

దుబ్బాకలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక, న్యూస్‌టుడే: శవ రాజకీయాలు చేయడం మాని, బాధిత కుటుంబానికి అందరూ అండగా నిలవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. గురువారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చిట్టాపూర్‌ శివారులోని బావిలో కారు పడటం దురదృష్టకర ఘటన అని, ఇదే క్రమంలో వెలికితీస్తుండగా ఎనగుర్తికి చెందిన బండకాడి నర్సింలు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకొని, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు ప్రారంభించానని చెప్పారు. నర్సింలు చనిపోయాడని తెలిశాక, కుటుంబీకులు వచ్చే వరకు తాను అక్కడే ఉన్నానని, వారితో మాట్లాడి అండగా ఉంటానని చెప్పినట్లు గుర్తుచేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుడి పిల్లలు చదువుకు తానే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి సిద్దిపేట పాలనాధికారి, ఆర్డీవోతో మాట్లాడానని, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని త్వరగా, పూర్తిగా ఇప్పించే బాధ్యత తనదేనని స్పష్టంచేశారు. అయితే కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడటం తగదన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష నా వంతుగా ఇస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం రూ.50 వేల కర్మ తదితర కార్యక్రమాల నిర్వహణకు, మరో రూ.50 వేలు నర్సింలు కూతురి పేరిట డిపాజిట్‌ చేస్తామని చెప్పారు. మూడో వార్డు కౌన్సిలర్‌ మట్ట మల్లారెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని