logo

వైశ్యులు సామాజిక సేవలో ముందుంటారు

ఆర్యవైశ్యులు వ్యాపారంతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటారని, కష్టపడి పని చేస్తారని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అన్నారు. హైదరాబాద్‌ వైశ్య యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 46వ కమిటీ ఎన్నిక లక్డీకాపూల్‌లో గురువారం నిర్వహించారు.

Published : 28 Jan 2022 04:19 IST

నూతన కమిటీ సభ్యులతో ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తదితరులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఆర్యవైశ్యులు వ్యాపారంతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటారని, కష్టపడి పని చేస్తారని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అన్నారు. హైదరాబాద్‌ వైశ్య యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 46వ కమిటీ ఎన్నిక లక్డీకాపూల్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ పర్యాటక హబ్‌గా మారనుందన్నారు. ఆర్య వైశ్యులకు ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం లభించిందని పేర్కొన్నారు. ఇటీవల కరోనా సమయంలో ఆర్యవైశ్యులు పేదలకు ఎంతో సాయం చేశారన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శేరి వెంకటేష్‌ను సత్కరించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి దేవేందర్‌ సముద్రాల, కోశాధికారి విజయ్‌కుమార్‌ గంప, సంయుక్త కార్యదర్శి వినీత్‌కుమార్‌ ఉప్పల, కార్యదర్శి నరేష్‌గుప్తా మాడిశెట్టి, మాజీ అధ్యక్షులు నగేష్‌ పాంపాటి, శ్రీనివాస్‌ బాశెట్టి, కొత్త రూపేష్‌ గుప్తా, ప్రతినిధులు శ్రీకాంత్‌ శేరి, చింతల అక్షయ్‌, వరుణ్‌ బొగ్గరపు తదితరులు ఉన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని