icon icon icon
icon icon icon

Modi: కాంగ్రెస్‌ యువరాజు ఏప్రిల్ 26 తర్వాత ఎక్కడికి వెళ్తారో..?: మోదీ

కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ (Modi) విమర్శలు గుప్పించారు.

Updated : 20 Apr 2024 18:50 IST

ముంబయి: ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రధాని మోదీ (Modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆ యువరాజు వయనాడ్‌లో కూడా ఓడిపోతారని, తర్వాత మరో సురక్షిత స్థానం చూసుకోవాల్సి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ ర్యాలీలో మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొదటి దశలో ఎన్డీయేకు ఏకపక్షంగా ఓట్లు పడినట్లు తెలుస్తోందన్నారు.

‘‘అమేఠీలో గతంలో ఓడిపోయిన కాంగ్రెస్ యువరాజు.. ఇప్పుడు వయనాడ్‌లోనూ ఓడిపోనున్నారు. ఏప్రిల్‌ 26 (వయనాడ్‌ పోలింగ్‌) తర్వాత సురక్షిత స్థానం కోసం ఆయన వెతుక్కోవాల్సి ఉంటుంది’’ అని మోదీ అన్నారు. అలాగే ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఉద్దేశించి పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. విపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన కొందరు నేతలు లోక్‌సభను వదిలి, రాజ్యసభకు వెళ్లిపోతున్నారన్నారు. వారికి ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన పరమైన సమస్యలను చక్కదిద్దేందుకు ఈ పదేళ్లు కేటాయించానని, ఇంకా ఎంతో పని చేయాల్సి ఉందన్నారు. అలాగే ఇండియా బ్లాక్‌కు నాయకుడంటూ లేరని, దాంతో దేశ భవిష్యత్తును ఎవరికి అప్పగించాలో ప్రజలకు తెలియడం లేదన్నారు.

అమిత్ షాకు సొంత కారు లేదట..

రాయబరేలీకి పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ.. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడటం లేదు. ఇటీవల రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ స్థానంలో ప్రియాంకా గాంధీ పోటీ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక గత ఎన్నికల్లో అమేఠీ నుంచి ఓడిపోయిన రాహుల్‌.. కేరళలోని వయనాడ్‌ నుంచి గెలుపొందారు. మరోసారి అక్కడి నుంచే బరిలో ఉన్న ఆయన.. అమేఠీలో పోటీ చేస్తారో లేదో వెల్లడి కావాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img