icon icon icon
icon icon icon

Kunwar Sarvesh Kumar: భాజపా ఎంపీ అభ్యర్థి మృతి.. పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజే ఘటన

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగిన భాజపా సీనియర్‌ నేత కువర్‌ సర్వేశ్‌ కుమార్‌ సింగ్‌ శనివారం మృతి చెందారు.

Published : 20 Apr 2024 21:29 IST

లఖ్‌నవూ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌ (Moradabad) నుంచి బరిలో దిగిన భాజపా సీనియర్‌ నేత కువర్‌ సర్వేశ్‌ కుమార్‌ సింగ్‌ (Kunwar Sarvesh Kumar Singh) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. భాజపా ఉత్తర్‌ప్రదేశ్ అధ్యక్షుడు భూపేంద్ర చౌధరీ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి విడతలో భాగంగా మురాదాబాద్‌కు శుక్రవారమే పోలింగ్‌ ముగిసింది. 60.60 శాతం ఓటింగ్‌ నమోదైంది.

దేశవిదేశాల్లోని శక్తిమంతులు ఏకమై.. నన్ను తొలగించే యత్నం: పీఎం మోదీ

రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందిన సర్వేశ్‌ కుమార్‌ (72).. యూపీలోని బాహుబలి నేతల్లో ఒకరిగా పేరుపొందారు. ఠాకుర్‌ద్వారా అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో మురాదాబాద్‌ నుంచి ఎంపీగా పోటీచేసి మహమ్మద్‌ అజహరుద్దీన్‌ చేతిలో ఓడిపోయారు. 2014లో ఇదే స్థానం నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఎస్‌టీ హసన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. వరుసగా నాలుగోసారి ఆయనకే భాజపా అవకాశం కల్పించింది. ఆయన తనయుడు కువర్‌ సుశాంత్‌ సింగ్‌ ప్రస్తుతం బర్హాపుర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img