Mamata Banerjee: హెలికాప్టర్‌లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్‌లో తూలి కింద పడిపోయారు. దీంతో ఆమెకు స్వల్ప గాయమైంది.

Updated : 27 Apr 2024 16:22 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కిన ఆమె అదుపుతప్పి తూలి కింద పడిపోయారు. ఈ మధ్యాహ్నం పశ్చిమ బర్ధమాన్‌ జిల్లాలోని దుర్గాపుర్‌ నుంచి దీదీ అసన్‌సోల్‌ వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కారు. లోపలికి వెళ్లి సీట్లో కూర్చునే సమయంలో ఆమె బ్యాలెన్స్‌ కోల్పోయి కిందపడ్డారు.

దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే సాయం చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయమైందని, అయినప్పటికీ సీఎం తన ప్రయాణాన్ని కొనసాగించారని అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. అసన్‌సోల్‌ స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) నుంచి అలనాటి నటుడు, ఎంపీ శతృఘ్నసిన్హా పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మమతా బెనర్జీ నేడు ప్రచారం చేపట్టారు.

జైల్లో కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు..!

కాగా.. గత నెల దీదీ తన ఇంట్లోనే జారిపడటంతో నుదుటిపై తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. మమత నుదుటి నుంచి రక్తం కారుతున్న ఫొటోను పార్టీ విడుదల చేసింది. ఆ తర్వాత తలకు కట్టుతోనే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక, 2023 జూన్‌లోనూ ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో అత్యవసరంగా హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేయగా.. అందులో నుంచి కిందకు దిగుతూ దీదీ గాయపడ్డారు. ఆమె మోకాలు, తుంటి లిగ్‌మెంట్లకు గాయాలయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని