icon icon icon
icon icon icon

Congress: రవిశంకర్‌ ప్రసాద్‌కు పోటీగా జగ్జీవన్‌రామ్‌ మనవడు

Congress: సంఘ సంస్కర్త జగ్జీవన్‌ రామ్‌ మనవడు ఎన్నికల బరిలోకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు పోటీగా కాంగ్రెస్‌ ఆయనను నిలబెట్టింది.

Published : 23 Apr 2024 17:52 IST

దిల్లీ: బిహార్‌లోని పట్నా సాహిబ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ (Congress) పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ (Meira Kumar) కుమారుడు డా.అన్షుల్‌ అవిజీత్‌ (Anshul Avijit)ను నిలబెట్టింది. ఈమేరకు పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.

ప్రస్తుతం పట్నా సాహిబ్‌ నియోజకవర్గానికి కేంద్ర మాజీమంత్రి, భాజపా నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ మరోసారి ఆయనకు టికెట్‌ ఇచ్చింది. ఆయనకు పోటీనిచ్చేందుకు కాంగ్రెస్‌ అన్షుల్‌ను బరిలోకి దింపింది. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ స్థానంలో భాజపాకు మంచి పట్టుంది. 2009, 2014లో భాజపా తరఫున ప్రముఖ నటుడు శతృఘ్నసిన్హా వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో  సిన్హా కాంగ్రెస్‌లో చేరి ఇదే స్థానం నుంచి పోటీ చేయగా.. ఆయనపై భాజపా నుంచి రవిశంకర్‌ బరిలోకి దిగి 61శాతం ఓట్లతో గెలుపొందారు.

స్లో‘గన్‌’ అందుకుంటే పేలాల్సిందే.. జనాల్లో నాటుకుపోయిన నినాదాలివే!

ఇక, అన్షుల్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌కు మనవడు. అన్షుల్‌ తల్లి మీరాకుమార్‌ యూపీఏ హయాంలో  15వ లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరించారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img