icon icon icon
icon icon icon

PM Modi: ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ

PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు.

Updated : 19 Apr 2024 20:03 IST

భోపాల్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఒకే రోజు పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం యూపీలో పర్యటించిన ఆయన.. అక్కడినుంచి మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) చేరుకున్నారు. దమోహ్‌లో ఏర్పాటుచేసిన భాజపా (BJP) బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడికి ఓ యువకుడు తీసుకొచ్చిన చిత్రాన్ని చూసి మోదీ ఉద్వేగానికి లోనయ్యారు.

సభలో ప్రధాని మాట్లాడుతుండగా దూరం నుంచి ఓ యువకుడి చేతిలో ఫొటోఫ్రేమ్‌ కన్పించింది. తన మాతృమూర్తి హీరాబెన్‌ (Heeraben) తనను ఆశీర్వదిస్తున్న ఫొటో అది. పెన్సిల్‌తో గీసిన ఆ చిత్రాన్ని చూసిన మోదీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిని గుర్తుచేసుకుని మాటలు రాక ప్రసంగాన్ని కొంతసేపు ఆపారు. ఆ తర్వాత చిత్రం తీసుకొచ్చిన యువకుడిని అభినందించారు. ఆ ఫొటో వెనక అతని పేరు, చిరునామా రాసివ్వాలని అతడికి సూచించారు. తాను లేఖ రాస్తానని మోదీ చెప్పారు.

ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్‌నాథ్‌ సూచన

ప్రధాని మాతృమూర్తి హీరాబెన్‌ 100 ఏళ్ల వయసులో 2022 డిసెంబరు 30న కన్నుమూసిన సంగతి తెలిసిందే. తల్లి చనిపోయిన దుఃఖంలోనూ ప్రధాని తన విధులను మరువలేదు. బాధను దిగమింగుకుని అదే రోజున పలు అధికారిక కార్యక్రమాల్లో వర్చువల్‌గా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img