icon icon icon
icon icon icon

సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్‌ అసత్య ప్రచారం

సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీపై కాంగ్రెస్‌ అసత్య ప్రచారం చేస్తోందని భాజపా నేత ప్రేమేందర్‌రెడ్డి శనివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు.

Published : 28 Apr 2024 04:19 IST

సీఈవో వికాస్‌రాజ్‌కు భాజపా ఫిర్యాదు

నారాయణగూడ, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీపై కాంగ్రెస్‌ అసత్య ప్రచారం చేస్తోందని భాజపా నేత ప్రేమేందర్‌రెడ్డి శనివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మెదక్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రసంగాన్ని మార్ఫింగ్‌ చేసి, ఫ్యాబ్రికేటెడ్‌ వీడియోలను పీసీసీ పోస్టు చేసిందని, అందుకు బాధ్యుడిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

మాజీ సీఎం కేసీఆర్‌పై వీహెచ్‌పీ నేతలు..

మాజీ సీఎం కేసీఆర్‌పై విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ప్రతినిధి బృందం శనివారం సీఈవో వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేసింది. వీహెచ్‌పీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామరాజు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.  

ఆదిలాబాద్‌ భాజపా అభ్యర్థిపై భారాస..

ఆదిలాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌పై భారాస నేత దాసోజు శ్రవణ్‌ శనివారం సీఈవో వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రవణ్‌ మాట్లాడుతూ.. నగేశ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌ను సరిగా నింపలేదని, ఆర్వోకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని తెలిపారు. భాజపా అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించని రిటర్నింగ్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img