icon icon icon
icon icon icon

మోదీజీ! చప్పట్లకు మోసపోకండి

కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న భాజపా సభల్లో వినిపించే చప్పట్లకు మోసపోవద్దని ప్రధాని మోదీని కోరుతూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం రెండు పేజీల లేఖ రాశారు.

Published : 26 Apr 2024 04:48 IST

ప్రధానికి ఖర్గే లేఖ

దిల్లీ: కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న భాజపా సభల్లో వినిపించే చప్పట్లకు మోసపోవద్దని ప్రధాని మోదీని కోరుతూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం రెండు పేజీల లేఖ రాశారు. ‘‘ఇటీవలి సభల్లో మీ (మోదీ) భాష విని నేనేమీ ఆశ్చర్యపోలేదు. మొదటిదశ పోలింగు చూశాక మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఆ ప్రసంగాలకు మీ సొంత వ్యక్తులు కొట్టే చప్పట్లు చూసి మోసపోకండి. మీ మాటలతో నిరాశకు గురైన కోట్లాదిమంది ప్రజల అభిప్రాయాలను వారు మీదాకా రానివ్వడం లేదు. మా మ్యానిఫెస్టోలో చేర్చని అంశాల గురించి సలహాదారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం మీరు మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారు. మణిపుర్‌లో మహిళలపై అకృత్యాలకు మీ ప్రభుత్వం కారణం కాదా? మీ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే వారి భార్యాపిల్లల్ని రక్షిస్తున్నారా? మీరు ప్రధాని పదవి ప్రతిష్ఠ దిగజారేలా, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు. మా న్యాయపత్రాన్ని వివరించేందుకు మీతో వ్యక్తిగత భేటీకి సమయమిస్తే సంతోషిస్తాను’’ అని ఖర్గే లేఖ ముగించారు. దీన్ని ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img