icon icon icon
icon icon icon

రాయ్‌బరేలీ, అమేఠీల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులపై వీడని ఉత్కంఠ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎవరనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రెండు చోట్ల అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం వెల్లడించింది.

Updated : 30 Apr 2024 22:50 IST

నిర్ణయాధికారం ఖర్గేకు అప్పగింత

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎవరనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రెండు చోట్ల అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం వెల్లడించింది. యూపీ రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులుగా రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలనే ప్రకటించాలని పార్టీ అగ్రనాయకత్వానికి విజ్ఞప్తి చేశాయి. అమేఠీ, రాయ్‌బరేలకు పార్టీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు? రాహుల్‌, ప్రియాంక పోటీ చేస్తారా లేదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ నేరుగా సమాధానమివ్వలేదు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే తుది నిర్ణయం తీసుకుంటారని మాత్రమే తెలిపారు. రాహుల్‌ ఇప్పటికే కేరళలోని వయనాడ్‌ నుంచి బరిలోకి దిగారు. అక్కడ పోలింగ్‌ ముగిసింది. అమేఠీలోనూ ఆయన పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img