icon icon icon
icon icon icon

లోక్‌సభ బరిలో ఆనంద్‌ శర్మ.. గురుగ్రాం నుంచి రాజ్‌బబ్బర్‌

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఆనంద్‌శర్మ తొలిసారి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్డా నుంచి ఆయన బరిలో దిగనున్నారు.

Updated : 01 May 2024 05:47 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఆనంద్‌శర్మ తొలిసారి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్డా నుంచి ఆయన బరిలో దిగనున్నారు. 1984 ఏప్రిల్‌లో ఆయన మొదటిసారి రాజ్యసభకు ఎన్నికై, తర్వాత నాలుగుసార్లు అదేసభకు ప్రాతినిధ్యం వహించారు. యూపీయే సర్కారులో కేంద్రమంత్రిగా ఉన్నారు. 2022లో పదవీ విరమణ చేసేవరకు రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష ఉపనేతగా వ్యవహరించారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజ్‌బబ్బర్‌ హరియాణాలోని గురుగ్రాం నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. అక్కడ కేంద్రమంత్రి రావ్‌ ఇంద్రజీత్‌ సింగ్‌ భాజపా అభ్యర్థిగా ఉన్నారు. వీరిద్దరు సహా మరికొన్ని పేర్లను కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం ఖరారు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌పై పోటీ చేయడానికి ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే సత్పాల్‌ రైజాదాను కాంగ్రెస్‌ ఎంపిక చేసింది. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌పై ఉత్తర ముంబయి నియోజకవర్గంలో పోటీకి భూషణ్‌పాటిల్‌కు కాంగ్రెస్‌ అవకాశమిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img