icon icon icon
icon icon icon

రిజర్వేషన్లను రహస్యంగా లాక్కొంటున్న మోదీ సర్కార్‌: రాహుల్‌ గాంధీ

ప్రైవేటీకరణను గుడ్డిగా అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం రహస్యంగా లాక్కుంటోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Updated : 03 May 2024 06:34 IST

దిల్లీ:  ప్రైవేటీకరణను గుడ్డిగా అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం రహస్యంగా లాక్కుంటోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్‌ బలోపేతం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘2013లో ప్రభుత్వ రంగంలో 14 లక్షల శాశ్వత పోస్టులు ఉండగా అవి 2023 నాటికి 8.4 లక్షలకు చేరాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌, సెయిల్‌, బీహెచ్‌ఈఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని భాజపా సర్కార్‌ నాశనం చేసింది. మోదీ మోడల్‌ ప్రైవేటీకరణ దేశ వనరులను కొల్లగొట్టడమే. దీని ద్వారా అణగారిన వర్గాల రిజర్వేషన్లు లాగేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తాం. వాటిల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’’ అని రాహుల్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img