icon icon icon
icon icon icon

ప్రియాంక ఎందుకు పోటీ చేయట్లేదు?

గాంధీ కుటుంబానికి కంచుకోటల్లాంటి అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో కాంగ్రెస్‌ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే ఈ రెండు సీట్లలో ఎక్కడా పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రా బరిలో నిలవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Updated : 04 May 2024 06:42 IST

దిల్లీ: గాంధీ కుటుంబానికి కంచుకోటల్లాంటి అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో కాంగ్రెస్‌ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే ఈ రెండు సీట్లలో ఎక్కడా పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రా బరిలో నిలవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీనిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సోనియాగాంధీ ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాహుల్‌ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. ప్రియాంక కూడా పోటీ చేసి, అన్నాచెల్లెళ్లు ఇద్దరూ గెలిస్తే.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పార్లమెంటులో ఉన్నట్లవుతుంది. దాంతో కాంగ్రెస్‌ కుటుంబ పార్టీ అని విమర్శలు గుప్పించేందుకు భాజపాకు మరో అవకాశం ఇచ్చినట్లవుతుందని పార్టీ భావించినట్లు పలువురు చెబుతున్నారు. పోటీకి ప్రియాంక దూరంగా ఉండేందుకు ఇదో కారణమని వివరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img