icon icon icon
icon icon icon

పోలింగు నమోదుపై స్పష్టతకు నేడు ఈసీతో విపక్ష నేతల భేటీ

లోక్‌సభ ఎన్నికల పోలింగు ప్రతి దశలోనూ వాస్తవ గణాంకాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్న విపక్ష ఇండియా కూటమి నేతలు గురువారం ఎన్నికల సంఘాన్ని కలుసుకొని ఆ మేరకు విన్నవించనున్నారు.

Published : 09 May 2024 05:55 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల పోలింగు ప్రతి దశలోనూ వాస్తవ గణాంకాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్న విపక్ష ఇండియా కూటమి నేతలు గురువారం ఎన్నికల సంఘాన్ని కలుసుకొని ఆ మేరకు విన్నవించనున్నారు. అలాగే భాజపా ప్రచారంలో మతపరమైన చిహ్నాల ప్రదర్శన గురించి కూడా వీరు ఫిర్యాదు చేయనున్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లతో ఆయా అంశాలను చర్చించి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విపక్ష నేతలు సమర్పించనున్నారు. మొదటి రెండు దశల్లో పోలింగు వివరాల వెల్లడికి జరిగిన జాప్యంపై కాంగ్రెస్‌, టీఎంసీ, సీపీఎం ఇప్పటికే ఈసీకి లేఖలు రాశాయి. పోలింగు ముగిసిన వెంటనే బూత్‌ల వారీగా నమోదైన వాస్తవ ఓట్ల వివరాలు అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతున్నట్లు ఈసీ సైతం వివరణ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img