icon icon icon
icon icon icon

Arun Govil: ‘టీవీ రాముడి’ రోడ్‌షోలో జేబు దొంగల చేతివాటం..!

మేరఠ్‌ భాజపా అభ్యర్థి అరుణ్‌గోవిల్‌ పాల్గొన్న రోడ్‌షోలో పలు చోరీలు చోటుచేసుకున్నాయి. 

Published : 23 Apr 2024 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఆయా పార్టీ అభ్యర్థుల ప్రచారాలు మరింత జోరందుకున్నాయి. మద్దతుదారులతో భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు జేబుదొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. టీవీ రాముడిగా పేరొందిన మేరఠ్‌ భాజపా (BJP) అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ (Arun Govil) పాల్గొన్న రోడ్‌షోలో అనేక చోరీలు చోటుచేసుకున్నాయి.

ఈ రోడ్‌షోలో అరుణ్‌ గోవిల్‌తో పాటు ‘రామాయణ్‌’ సీరియల్‌లో సీత, లక్ష్మణ్‌లుగా నటింటిన దీపికా చిక్లియా, సునీల్‌ లహ్రీలు పాల్గొన్నారు. గోవిల్‌ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే జనాల్లో కలిసిపోయిన జేబుదొంగల ముఠా.. పలువురి నుంచి డబ్బు, నగలు, ఫోన్లను కాజేశారు. బాధితుల్లో కొందరు భాజపా నేతలు, విలేకరులు, వ్యాపారవేత్తలు కూడా ఉండటం గమనార్హం.

‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!

‘‘నా దుకాణం ఎదుట కూర్చున్న సమయంలో అరుణ్ గోవిల్‌ కాన్వాయ్‌ కనిపించింది. ప్రజలతో పాటు నేను ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ చేతులు పైకి ఎత్తాను. ఆ తర్వాత నా జేబు చూస్తే ఖాళీగా కనిపించింది. అందులో రూ.36 వేలను ఎవరో కాజేశారు’’ అని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తంచేశారు. బాధితులంతా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీటిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి తస్కరించిన పలు సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దిల్లీకి చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img