icon icon icon
icon icon icon

Yusuf Pathan: రాజకీయాల్లోనే ఉంటా.. గుజరాత్‌ ‘పఠాన్‌’ బెంగాల్‌లో పోటీ!

రాజకీయాల్లో కొనసాగేందుకే బెంగాల్‌కు వచ్చానని, స్థానికులతో మమేకమై పని చేస్తానని మాజీ క్రికెటర్‌, టీఎంసీ నేత యూసఫ్‌ పఠాన్‌ (Yusuf Pathan) పేర్కొన్నారు.

Updated : 21 Apr 2024 14:08 IST

కోల్‌కతా: తాను రాజకీయాల్లో కొనసాగేందుకే ఇక్కడకు వచ్చానని, స్థానిక ప్రజల కోసమే పని చేస్తానని మాజీ క్రికెటర్‌, టీఎంసీ నేత యూసఫ్‌ పఠాన్‌ (Yusuf Pathan) పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన ఆయన.. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌కు ప్రత్యర్థిగా బరిలో ఉన్నారు. అన్నిరకాల క్రికెట్‌ ఫార్మాట్‌ల నుంచి 2021లోనే రిటైరైన పఠాన్‌.. ప్రస్తుతం బహరంపుర్‌ లోక్‌సభ స్థానం (Lok Sabha Elections) నుంచి పోటీలో ఉన్నారు.

‘స్థానికులు నన్ను సొంత మనిషిగా భావిస్తున్నారు. ఎన్నికల ఫలితం ఎలా వచ్చినా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంటాను. గెలుస్తానని నమ్మకం ఉంది. మమ్మల్ని వదిలి వెళ్లనివ్వమని చెబుతున్న ప్రాంతానికి రావడం సంతోషంగా ఉంది’ అని యూసఫ్‌ పఠాన్‌ పేర్కొన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ప్రత్యర్థి అధీర్‌ రంజన్‌ అంటే వ్యక్తిగతంగా తనకెంతో గౌరవం ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

రాజకీయ పార్టీల ఉచిత హామీలపై చర్చ జరగాలి: దువ్వూరి సుబ్బారావు

కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ముర్షిదాబాద్‌ జిల్లాలోని బహరంపుర్‌ లోక్‌సభ స్థానం నుంచి యూసఫ్‌ పఠాన్‌ పోటీలో ఉన్నారు. గుజరాత్‌కు చెందిన ఈయన.. పశ్చిమ బెంగాల్‌ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడిన ఆయన.. టీఎంసీ అధినాయకత్వంతో సన్నిహితంగా మెలిగారు. మరోవైపు జాతీయ స్థాయిలో విపక్ష కూటమి ‘ఇండియా’లో భాగస్వామ్యమైన ఈ రెండు పార్టీలు.. బెంగాల్‌లో వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img