icon icon icon
icon icon icon

BJP: రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై భాజపా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 

Published : 22 Apr 2024 23:15 IST

దిల్లీ: ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో భాజపా కూడా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ.. పశ్చిమబెంగాల్‌లో వివాదానికి దారితీసేలా ఉన్నాయని దుయ్యబట్టింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్కపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నిరాశలో ఉందని మండిపడింది.

‘‘రాహుల్‌గాంధీ అసత్య ప్రచారాలు చేస్తూ.. భాజపాపై కుట్ర పన్నుతున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భాష, ప్రాంతం ప్రాతిపదికన ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్‌ కుట్ర పన్నుతున్న తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం’’ అని భాజపా నేత తరుణ్‌ చుగ్‌ పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌ ఆరోగ్యం.. మెడికల్‌ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం

మరోవైపు.. రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ గెలిస్తే ఆస్తులను ముస్లింలకే ఇచ్చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ప్రధానిపై చర్యలు తీసుకోవాలని కోరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img