icon icon icon
icon icon icon

Rahul Gandhi: ‘రాజ్యాంగాన్ని ఏ శక్తీ మార్చలేదు’.. అమిత్‌షాపై రాహుల్‌ విమర్శలు

రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు కోసం కేంద్రంలోని భాజపా కలలు కంటోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. 

Published : 30 Apr 2024 19:56 IST

దిల్లీ: రాజ్యాంగ మార్పుపై కొంతకాలంగా భాజపా- కాంగ్రెస్‌ల నడుమ మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి స్పందించారు. కేంద్రమంత్రి అమిత్‌ షాపై విమర్శలు గుప్పించారు. మన రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేదంటూ మండిపడ్డారు.

‘‘భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆయా సందర్భాల్లో ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. ఈవిషయాన్ని అమిత్‌ షా కూడా చెప్పారు’’ అని రాహుల్‌ ఆరోపించారు. ‘‘బి.ఆర్‌. అంబేడ్కర్‌ కాంగ్రెస్‌, దేశ ప్రజలతో కలిసి బ్రిటిష్‌ వారితో పోరాడి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది పేద ప్రజల ఆత్మ, గొంతుక వంటిది.  దాన్ని ఎవరూ తాకలేరు. మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. అలాంటిది రాజ్యాంగ మార్పుకై కేంద్రంలోని భాజపా కలలు కంటోంది. అలా ఎన్నటికీ జరగనివ్వం’’ అని వ్యాఖ్యానించారు.

‘అసహనంతోనే ఫేక్‌ వీడియోలు’ : కాంగ్రెస్‌పై మండిపడ్డ అమిత్‌ షా

భవిష్యత్తుకు భరోసా ఇస్తోన్న రాజ్యాంగాన్ని మార్చి.. రిజర్వేషన్లను రద్దు చేయాలన్నది భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్దేశమని మరోసారి రాహుల్‌ మండిపడ్డారు. కానీ, ఇప్పుడు తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ రంగాన్ని, రైల్వేలను ప్రైవేటీకరించడం, అగ్నివీర్‌ను ప్రవేశపెట్టడం ఎందుకని ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img