icon icon icon
icon icon icon

Rahul Gandhi: ‘ఇండియా’ కూటమి వస్తే.. మోదీ అవినీతి పాఠశాలకు లాక్‌: రాహుల్‌ గాంధీ

దేశంలో ప్రధాని మోదీ అవినీతి పాఠశాలను నడుపుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. 

Published : 20 Apr 2024 15:36 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదిక వ్యాఖ్యానించారు.

‘‘దేశంలో అవినీతి పాఠశాలను ప్రధాని మోదీ నడుపుతున్నారు. ఈ స్కూల్‌లో ‘డొనేషన్‌ బిజినెస్‌’ అనే కోర్స్‌లోని ప్రతీ అధ్యాయాన్ని స్వయంగా ఆయనే బోధిస్తున్నారు. దానాన్ని కూడా వ్యాపారంగా ఎలా మార్చాలో మోదీ వివరిస్తారు. సోదాలు నిర్వహించి విరాళాలు ఎలా సేకరించాలి?విరాళాలు తీసుకున్న అనంతరం ఒప్పందాల పంపిణీ ఎలా చేయాలి?అనే అంశాలను వివరిస్తారు’’ అని రాహుల్‌ ఆరోపించారు. 

అమిత్ షాకు సొంత కారు లేదట..

అయితే, కాషాయ పార్టీలోని ప్రతి నేతకూ ఈ కోర్సును తప్పనిసరి చేసిందన్నారు. అవినీతిపరుల నేర మరకలను వాషింగ్‌ మెషీన్‌లా కడిగేస్తోదంటూ భాజపాను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ఏజెన్సీలను రికవరీ ఏజెంట్లుగా మార్చి ‘బెయిల్‌’, ‘జైలు’ అనే గేమ్‌ను ఎలా ఆడాలో వివరించగలదన్నారు. అవినీతికి భాజపా నిలయంగా మారిందని విమర్శించారు. ఒక వేళ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే మోదీ నడుపుతున్న అవినీతి పాఠశాలతో పాటు ఈ కోర్సును పూర్తిగా మూసివేస్తుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img