icon icon icon
icon icon icon

Rajnath Singh: ‘డైనోసర్లు’లా కాంగ్రెస్‌ అంతరించిపోతుంది’.. రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శల బాణాలు

కాంగ్రెస్‌ పార్టీపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. డైనోసర్లు ఎలా అంతరించిపోయాయో అలా ఆ పార్టీ కూడా త్వరలో కనుమరుగయ్యే అవకాశం ఉందని అన్నారు. 

Published : 25 Apr 2024 20:06 IST

లఖ్‌నవూ: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) కాంగ్రెస్‌ పార్టీ (Congress)పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంతరించే దశకు చేరిందన్నారు. మరికొద్ది కాలంలో ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

మోదీ సర్కార్‌ పదేళ్ల పాలనలో దేశాభివృద్ధిపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. మోదీ ప్రధాని పదవి చేపట్టినప్పటినుంచి దేశ రక్షణ, అంతర్గత భద్రత, ఆర్థిక వ్యవస్థ, ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించిదన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ‘‘డైనోసర్ల లా కాంగ్రెస్‌ పార్టీ కూడా త్వరలో అంతరించిపోతుంది’’ అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక పార్టీ భాజపా అని అన్నారు.

కేంద్రమంత్రి ఆడియో క్లిప్‌ లీక్‌ చేయమన్నారు: రాజస్థాన్‌ మాజీ సీఎం గహ్లోత్‌పై ఆరోపణలు

‘‘కాంగ్రెస్‌ హయాంలో భారత్‌- చైనా సరిహద్దులో చొరబాట్లకు భయపడి రోడ్డును నిర్మించలేకపోయింది. కానీ, మోదీ సర్కార్‌ సరిహద్దులో మౌలిక సదుపాయలను మెరుగుపరచడమే కాక.. శత్రువులను ఎదుర్కొనేందుకు భారత సైన్యాన్ని మరింత బలపర్చింది’’ అని వ్యాఖ్యానించారు. వారసత్వ పన్ను గురించి కాంగ్రెస్ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుటుంబపెద్ద మరణానంతరం ఆస్తిలో 55 శాతం కోల్పోయేందుకు ప్రజలు ఎలా అనుమతించగరని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img