icon icon icon
icon icon icon

Rapido Offer: పోలింగ్‌ రోజున ర్యాపిడో ‘ఫ్రీ’ రైడ్‌.. వీరికి మాత్రమే

ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఉచితంగా బైక్‌ రైడ్‌ సదుపాయాన్ని కల్పిస్తామని రైడ్‌ షేరింగ్‌ సంస్థ ‘ర్యాపిడో’ ప్రకటించింది.

Published : 24 Apr 2024 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఎన్నికల పండగ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రైడ్‌ షేరింగ్‌ ‘ర్యాపిడో’ ఓటర్ల కోసం ఓ ఆఫర్‌ తీసుకొచ్చింది. పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఉచితంగా బైక్‌ రైడ్‌ (Bike Ride) సదుపాయాన్ని కల్పిస్తామని బుధవారం ప్రకటించింది. తమ సేవలను కేవలం కర్ణాటక (Karnataka)లో మాత్రమే అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలోనే ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా తమవంతు కృషి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ర్యాపిడో ఓ ప్రకటనలో పేర్కొంది.

ఎన్నికల కోసం ఎల్లలు దాటి.. స్వదేశానికి వేల మంది ఎన్నారైలు!

ఇందుకోసం ‘సవారీ జిమ్మదారీకీ’ కార్యక్రమం పేరిట సీనియర్‌ సిటిజన్స్‌, దివ్యాంగులకు మాత్రమే సేవలందించేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. బెంగళూరు, మైసూర్‌, మంగళూరులో ఓటు వినియోగించుకునేవారు 'VOTE NOW' కోడ్‌ను వినియోగించి తమ సేవలను పొందాలని కోరింది. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే క్రమంలో రవాణా విషయంలో ఎటువంటి ఆందోళన చెందకుండా దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లు తమ సేవలను వినియోగించుకోవాలని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img