icon icon icon
icon icon icon

Akhilesh Yadav: ఎస్పీ కంచుకోట నుంచి అఖిలేశ్‌ పోటీ..

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కన్నౌజ్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ స్పష్టం చేసింది. 

Published : 24 Apr 2024 22:06 IST

లఖ్‌నవూ: సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) పోటీ చేసే స్థానం ఖరారైంది. ఆ పార్టీ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఎస్పీ ‘ఎక్స్‌’లో వెల్లడించింది.

గురువారం మధ్యాహ్నం ఆయన తన నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ సమాచారమిచ్చింది. ముందుగా ఈ స్థానం నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దింపాలనుకున్నా.. తాజాగా అఖిలేశ్‌ పోటీకి దిగుతున్నారు. కన్నౌజ్‌లో ఎస్పీతో సహా అఖిలేశ్‌ కుటుంబానికి మంచి పట్టుంది. 2019లో అజంగఢ్‌ స్థానం నుంచి పోటీ చేసిన అఖిలేశ్‌ విజయం సాధించారు. కానీ, 2022లో కర్హల్‌ నుంచి ఎన్నికైనా ఆ తర్వాత అక్కడి నుంచి తప్పుకొన్నారు.

ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్‌ కేసులో సునేత్ర పవార్‌కు క్లీన్‌ చిట్‌

మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి అఖిలేశ్‌ రంగంలో దిగుతారంటూ వస్తోన్న ఊహాగాహాల మధ్య ఆ పార్టీ ఆయన పోటీపై క్లారిటీ ఇచ్చింది. 2019 వరకు సమాజ్‌వాదీ పార్టీకి కన్నౌజ్‌ కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో భాజపా నేత సుబ్రాత్‌ పాఠక్ అక్కడి నుంచి విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికల్లో గెలుపొందిన అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌.. 2014లోనూ సీటు దక్కించుకున్నారు. 2019లో ఆమె ఓటమిపాలయ్యారు. అనంతరం ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో 2022లో మెయిన్‌పురికి జరిగిన ఉప ఎన్నికలో డింపుల్‌ విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img