icon icon icon
icon icon icon

Smriti Irani: అయోధ్య పర్యటనతో కాంగ్రెస్‌ కొత్త నాటకం.. రాహుల్‌పై స్మృతి ఇరానీ ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్‌ నేతలు.. ఎన్నికల వేళ అయోధ్య పర్యటన పేరుతో కొత్త నాటకానికి తెర లేపుతున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.

Published : 27 Apr 2024 14:46 IST

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థులు ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో హస్తం పార్టీపై భాజపా నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

‘‘ఇప్పటివరకు అమేఠీలో సమస్యపై దృష్టి పెట్టాం. కానీ, ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారు కోసం ఎదురు చూస్తున్నాం. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికై కేంద్రం పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ తిరస్కరించింది. కానీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక అయోధ్య పర్యటనకు సిద్ధమవుతున్నారు. పర్యటన పేరుతో కాంగ్రెస్‌ కొత్త నాటకానికి తెర లేపుతోంది. రాముడి పేరును వినియోగించుకుని ఓట్లు అడిగేందుకే ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే రాహుల్‌ ఈ పర్యటనకు సిద్ధమయ్యారు’’ అని విమర్శలు గుప్పించారు.

రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్‌ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం

కాంగ్రెస్‌ కంచుకోటలుగా పేరొందిన రాయ్‌బరేలీ, అమేఠీ సహా పలు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను నేడు ఖరారు చేసే అవకాశాలున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలో భేటీ కానుంది. ఐదో విడతలో భాగంగా అమేఠీలో మే 20న పోలింగ్‌ జరగనుంది. ఈ నియోజకవర్గానికి గత 15 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన రాహుల్‌.. 2019 ఎన్నికల్లో స్మృతి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img