icon icon icon
icon icon icon

varla ramaiah: సచివాలయానికి వెళ్లలేని వారు.. బ్యాంకుకు ఎలా వెళ్తారు?: వర్ల

వెయ్యి మంది ఏపీ పోలీసులు మహారాష్ట్రలో ఎన్నికల విధులకు వెళ్లారని, వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య కోరారు.

Published : 29 Apr 2024 20:18 IST

అమరావతి: వెయ్యి మంది ఏపీ పోలీసులు మహారాష్ట్రలో ఎన్నికల విధులకు వెళ్లారని, వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రాన్ని ఎన్నికల అధికారులకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పింఛన్లు పంపిణీపై ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం దారుణమన్నారు. ‘‘పింఛన్లు బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తే లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. పింఛన్‌ కోసం సచివాలయానికి వెళ్లలేని వారు.. బ్యాంకులకు ఎలా వెళ్తారు? మరోమారు వృద్ధుల ప్రాణాలు తీయాలని, జగన్‌కు లబ్ధి చేకూర్చాలని సీఎస్‌ చూస్తున్నారు’’అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img