icon icon icon
icon icon icon

Varun Gandhi: రాయ్‌బరేలీ నుంచి పోటీ.. వరుణ్ గాంధీకి భాజపా ఆఫర్‌?

రాయ్‌బరేలీ నుంచి వరుణ్ గాంధీని బరిలోకి దింపేందుకు భాజపా ప్రతిపాదించింది. అయితే పార్టీ నిర్ణయాన్ని ఆయన తిరస్కరించినట్లు సమాచారం. 

Published : 26 Apr 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెబల్‌ నేత వరుణ్‌గాంధీని నిలబెట్టేందుకు భాజపా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన్ను కాషాయ పార్టీ సంప్రదించినట్లు సమాచారం. అయితే.. పార్టీ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకగాంధీని రంగంలోకి దింపాలని కాంగ్రెస్‌ చూస్తోన్న సమయంలో.. భాజపా ప్రతిపాదన ఆసక్తిగా మారింది.

ఈ స్థానంపై కాంగ్రెస్‌ పార్టీకి మంచి పట్టుంది. 2004 నుంచి సోనియాగాంధీ ఇక్కడినుంచే పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి ఆమె రాజ్యసభకు వెళ్లడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. సోనియా ఈసారి ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో.. ప్రియాంకగాంధీని ఇక్కడినుంచి బరిలోకి దింపేందుకు హస్తం పార్టీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్‌గాంధీ సోదరుడు వరుణ్‌ను కాంగ్రెస్‌కు పోటీగా నిలబెట్టేందుకు భాజపా పావులు కదుపుతోంది. కానీ, ఆయన ఎన్నికల పోరు నుంచి వైదొలిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయంపై ఆయన అధికారంగా ప్రకటించాల్సి ఉంది.

కేంద్రమంత్రి ఆడియో క్లిప్‌ లీక్‌ చేయమన్నారు: రాజస్థాన్‌ మాజీ సీఎం గహ్లోత్‌పై ఆరోపణలు

వరుణ్‌గాంధీ పీలీభీత్‌ సిట్టింగ్‌ ఎంపీ. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు మొండిచేయి చూపిన భాజపా.. ఈ స్థానంలో యూపీ మాజీ మంత్రి జితిన్‌ ప్రసాదకు అవకాశం కల్పించింది. వరుణ్‌ తల్లి మేనకాగాంధీకి సుల్తాన్‌పుర్‌ను ఖారారు చేసింది. ఇదిలాఉంటే.. కాంగ్రెస్‌ కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేఠీ అభ్యర్థులపై ఆ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈక్రమంలోనే హస్తం పార్టీకి వ్యతిరేకంగా ఈ స్థానం నుంచి పోటీ చేయకూడదనే వరుణ్‌ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సొంత పార్టీపై ఆయన విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img