ది పాన్‌ స్టూడియో.. 150 రకాల కిళ్లీలు

కిళ్లీ.. భారత సంస్కృతిలో ఓ భాగం. భోజనం తర్వాత కిళ్లీ లేకపోతే ఏదో వెలితిగా భావించేవారు చాలా మందే ఉంటారు. ఇంతగా ప్రజలు ఆదరించే పాన్‌లో ఎన్నో ఫ్లేవర్లు ఉన్నాయి. అవన్నీ ఒకే చోట లభించడమంటే చాలా కష్టం.....

Published : 24 Feb 2021 11:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిళ్లీ.. భారత సంస్కృతిలో ఓ భాగం. భోజనం తర్వాత కిళ్లీ లేకపోతే ఏదో వెలితిగా భావించేవారు చాలా మందే ఉంటారు. ఇంతగా ప్రజలు ఆదరించే పాన్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ ఒకే చోట లభించడమంటే చాలా కష్టం. కానీ వాటన్నింటినీ ఒకే చోట అందించే ప్రయత్నం చేసింది కర్ణాటకకు చెందిన ‘ది పాన్‌ స్టూడియో’. పాన్‌ ప్రియులకు ప్రత్యేకమైన అనుభూతి అందించేందుకు బెంగళూరులోని ఫేజర్‌ టౌన్‌కు చెందిన మతీన్‌ సయ్యద్‌ ఖలీల్‌ సోదరులు ఈ కేఫ్‌ను ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా ఉండే కిళ్లీ ఫ్లేవర్లను ఇక్కడ రుచి చూడొచ్చు. పాన్‌, పాన్‌ చాక్లెట్లు, పాన్‌ ఫ్లేవర్డ్‌ డ్రై ఫ్రూట్స్‌, నేచురల్‌ టీ వంటి 150 రకాల పాన్‌ ఫ్లేవర్లు ‘ది పాన్‌ స్టూడియో’లో లభిస్తాయి. వీటిలో 50 రకాలు సాదా పాన్‌లు కాగా.. మరో 100 ఇతర సహజ ఫ్లేవర్లు. వీటిల్లో టోబ్లెరోన్‌, చాక్లెట్‌, కాఫీ, కేసరి, పుదీనా వంటివి  ఉన్నాయి. ఫ్లేవర్‌ ఆధారంగా ఒక్కో కిళ్లీ ధర రూ.50 నుంచి రూ.150 వరకు ఉంటుంది. ఈ కేఫ్ వంద శాతం పొగాకు రహితమైంది. ఇది కిల్లీ ప్రేమికులకు ఓ గొప్ప అనుభూతి అందిస్తుందన్న నిర్వాహకులు ఇటువంటి స్టూడియో ప్రారంభించడం దేశంలో ఇదే తొలిసారి కావచ్చని అన్నారు. ఈ కేఫ్‌ కొత్త అనుభూతిని ఇస్తోందని వినియోగదారులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని