Lokesh - Brahmani: వివాహ 16వ వార్షికోత్సవం.. యువగళంలో కేక్‌ కట్‌ చేసిన లోకేశ్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 195వ రోజు కొనసాగుతోంది. నూజివీడు నియోజవకర్గంలోని పోతిరెడ్డిపల్లికి లోకేశ్‌ చేరుకున్నారు. అరిసెలతో తయారు చేసిన గజమాలతో గ్రామస్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

Updated : 26 Aug 2023 19:29 IST

నూజివీడు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 195వ రోజు కొనసాగుతోంది. నూజివీడు నియోజవకర్గంలోని పోతిరెడ్డిపల్లికి లోకేశ్‌ చేరుకున్నారు. అరిసెలతో తయారు చేసిన గజమాలతో గ్రామస్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇవాళ లోకేశ్, బ్రాహ్మణిల వివాహ 16వ వార్షికోత్సవం సందర్భంగా యువగళం వాలంటీర్లు, తెదేపా శ్రేణులు ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి, పిట్టలవారి పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలని గ్రామస్థులు లోకేశ్‌కు వినతిపత్రం అందజేశారు.

‘పుష్ప’ సినిమాలో నా ఫొటో పెట్టారని.. వైకాపా వాళ్లు ఏడుస్తున్నారు: చంద్రబాబు

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌కు అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ తాగు, సాగునీటి ప్రాజెక్టులపై లేదని మండిపడ్డారు. తెదేపా హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై ₹68,294 కోట్లు ఖర్చుచేస్తే, వైకాపా ప్రభుత్వం వచ్చాక అందులో నాలుగో వంతు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక చింతలపూడి ప్రాజెక్టు, పిట్టలవారిపాలెం వద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తామని తెలిపారు. గ్రామ ఎస్సీ కాలనీలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునరుద్ధరిస్తామన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు