Chandrababu: ‘పుష్ప’ సినిమాలో నా ఫొటో పెట్టారని.. వైకాపా వాళ్లు ఏడుస్తున్నారు: చంద్రబాబు

‘పుష్ప’ (Pushpa)సినిమాలో తన ఫొటో ఉందని వైకాపా వాళ్లు ఏడుస్తున్నారని చంద్రబాబు అన్నారు.

Updated : 26 Aug 2023 10:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలో తన ఫొటో పెట్టారని.. వైకాపా వాళ్లు ఏడుస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తాజాగా విలేకర్లతో జరిపిన ఇష్టాగోష్టిలో ఆయన (Chandrababu) ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లర్‌గా తన నటనతో మెప్పించిన అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు ఇచ్చినప్పుడు.. వైకాపాలోని నిజమైన స్మగ్లర్లకు ఏ అవార్డు ఇవ్వాలి?’’ అని ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెబుతూ.. ‘‘పుష్ప’లో కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌ గ్రౌండ్‌లో నా ఫొటో ఉంటుంది. ఆ సినిమాలో చూపించిన కాలంలో నేను సీఎంగా ఉన్నాననో.. లేదంటే ఎర్రచందనం స్మగ్లర్లను నేను కంట్రోల్‌ చేశాననో వాళ్లు నా ఫొటో పెట్టి ఉండొచ్చు. దానికే వైకాపా వాళ్లు ఏడుస్తున్నారు’ అని అన్నారు. 

హిందీలో 27.. తెలుగులో ఒకరు.. ఇప్పటివరకూ జాతీయ అవార్డులు పొందిన నటులెవరంటే?

ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు. అలాగే, వివిధ విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకున్న వారందరికీ అభినందనలు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా తన విషెస్‌ తెలియజేశారు.

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకు దొరికినప్పుడు అక్కడ పోలీస్‌ స్టేషన్‌లో గోడకు చంద్రబాబు ఫొటో ఉంటుంది. అలాగే సినిమాలోని మరో సన్నివేశంలోనూ ఆయన ఫొటో కన్పిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు