రాష్ట్రంలో మ‌రో 7 మెడిక‌ల్ కాలేజీలు: కేటీఆర్‌

జర్నలిస్టులు, వ్యాపారులకు టీకాలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిన తెలంగాణ‌ ప్రభుత్వం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేర‌కు కేబినేట్‌లో నిర్ణ‌యం..

Updated : 30 May 2021 20:20 IST

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో ఏడు మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్‌ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. మ‌హ‌బూబాబాద్‌, జ‌గిత్యాల‌, సంగారెడ్డి, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, కొత్త‌గూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ఆయ‌న ట్వీట్ ద్వారా తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క ముందు కేవ‌లం నాలుగు మెడిక‌ల్ కాలేజీలే ఉన్నాయ‌న్న కేటీఆర్.. కేసీఆర్ ప్ర‌భుత్వంలో 2014- 18 మ‌ధ్య ఐదు కాలేజీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. త్వ‌ర‌లో మ‌రో ఏడు వైద్య‌ క‌ళాశాల‌లు అందుబాటులోకి రానున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. వీటితో పాటు 13 న‌ర్సింగ్ క‌ళాశాల‌ల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. 100 చొప్పున సీట్ల‌తో న‌ర్సింగ్ క‌ళాశాల‌లు మంజూర‌య్యాయి.  

దీంతో పాటు జర్నలిస్టులు, వ్యాపారులకు టీకాలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిన తెలంగాణ‌ ప్రభుత్వం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేర‌కు కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. ఉన్న‌త విద్య కోసం విదేశాల‌కు వెళ్లే వారికి వ్యాక్సినేష‌న్‌లో ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి త్వ‌రలో మార్గ ద‌ర్శ‌కాలు విడుద‌ల చేస్తామ‌న్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని