తిరుమల చేరుకున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ తిరుమల చేరుకున్నారు. దిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమల వచ్చారు. తిరుమల చేరుకున్న సీఎంకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ ....

Updated : 23 Sep 2020 17:19 IST

తిరుమల: ఏపీ సీఎం జగన్‌ తిరుమల చేరుకున్నారు. దిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమల వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం తిరుమల చేరుకున్న సీఎంకు పద్మావతి అతిథిగృహం వద్ద తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ సింఘాల్‌ ఘన స్వాగతం పలికారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం శ్రీనివాసుడి గరుడ వాహన సేవలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. కాసేపట్లో అన్నమయ్య భవన్‌లో ప్రధాని మోదీతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొంటారు. అనంతరం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

ఇప్పటికే ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, మేకతోటి సుచరిత, మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డి తిరుమల చేరుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డిక్లరేషన్‌ వివాదం దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు కూడళ్ల వద్ద పోలీసులు మోహరించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని