ఈ సంగీతం ముగిసేది 2640వ సంవత్సరంలోనే!
సంగీతంతో ప్రయోగాలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. ఒకే సంగీతాన్ని వివిధ వాయిద్యాలతో వినిపిస్తుంటారు. టెంపోను పెంచి.. తగ్గించి సంగీతాన్ని రూపొందించేవాళ్లు ఉంటారు. ఆపకుండా కొన్ని గంటల పాటు వాయిద్యాలను వాయించేవారూ
ఇంటర్నెట్ డెస్క్: సంగీతంతో ప్రయోగాలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. ఒకే సంగీతాన్ని వివిధ వాయిద్యాలతో వినిపిస్తుంటారు. టెంపోను పెంచి.. తగ్గించి సంగీతాన్ని రూపొందించేవాళ్లు ఉంటారు. ఆపకుండా కొన్ని గంటల పాటు వాయిద్యాలను వాయించేవారూ ఉంటారు. కానీ, ఓ సంగీతాన్ని అత్యంత నెమ్మదిగా వాయించగలమని ఓ సంగీతకళాకారుడు చెప్పగా.. దాన్ని నిజం చేసే పనిలో పడ్డారు కొందరు సంగీత కళాకారులు. ఆయన సృష్టించిన ఓ సంగీతాన్ని అత్యంత నెమ్మదిగా వాయించేలా ఓ పరికరాన్ని రూపొందించారు. గత 19 ఏళ్లుగా నెమ్మదిగా వాయిస్తున్న ఈ పరికరం.. సంగీతంలోని నోట్స్‌ను పూర్తి చేయాలంటే మరో ఆరు శతాబ్దాలకుపైగా సమయం పట్టనుందట.
అమెరికాకు చెందిన జాన్ కేజ్ అనే సంగీత కళాకారుడు 1985లో పియానోతో ‘యాస్ స్లో యాస్ పాజిబుల్(ఏఎస్‌ఎల్‌ఎస్పీ)’పేరుతో ఓ సంగీతాన్ని రూపొందించాడు. దానిని 20 నిమిషాల నుంచి 70 నిమిషాల వరకు వాయించొచ్చు. అయితే 1987లో ఇదే సంగీతాన్ని బొంగు రూపంలో ఉండే కీబోర్డు ‘ఆర్గాన్’తో మరోసారి రూపొందించారు. ఈ సంగీతంలో ఉండే ఒక్కో నోట్‌ను ఎంత నెమ్మదిగా వాయించొచ్చనే విషయాలను కేజ్ వివరంగా తెలిపారు. ఆయన మరణించిన తర్వాత 1997లో ‘యాస్ స్లో యాజ్ పాజిబుల్’ను అత్యంత నెమ్మదిగా వాయించాలని కొందరు సంగీతకళాకారులు నిర్ణయించారు. చర్చలు, పరిశీలన అనంతరం ఈ సంగీతాన్ని ఆర్గాన్‌లో అత్యంత నెమ్మదిగా వాయిస్తే 639 సంవత్సరాలు పడుతుందని లెక్కగట్టి.. ప్రాజెక్టును ప్రారంభించారు.
ఈ ఆర్గాన్2/ఏఎస్‌ఎల్‌ఎస్పీ ప్రాజెక్టు కోసం జర్మనీలోని హల్బర్సాట్‌లోని సెయింట్ బుచర్డి చర్చిని ఎంపిక చేసుకున్నారు. 2001 సెప్టెంబర్ 5న ప్రత్యేకమైన వాయిద్య పరికరం ఆర్గాన్‌ను ఏర్పాటు చేశారు. ఇది కర్ర బొంగులతో రూపొందించిన సంగీత వాయిద్యం. పరికరంలోని ఒక్కో కర్ర బొంగు సంగీతంలోని ఒక్కో నోట్‌ను వినిపిస్తుంటాయి. దీంతో ఎఎస్‌ఎల్‌ఎస్పీలోని సంగీతంలో ఉండే నోట్స్‌ను బట్టి వాటిని అమర్చుతున్నారు. తొలి నోట్ పెట్టినా సంగీతం మొదలయ్యే ముందు వచ్చే నిశ్శబ్దమే 2003 ఫిబ్రవరి వరకు సాగింది. ఆ తర్వాత నోట్స్ మార్చడానికి వారి ప్రణాళిక ప్రకారం కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతోంది. ఈ మధ్య కాలంలో అయితే సెప్టెంబర్ 5న ఆర్గాన్‌లో ఒక నోట్‌ను మార్చారు. మళ్లీ 2022 ఫిబ్రవరి 5న నోట్ మార్చనున్నారు. ఇలా ఈ సంగీతం ఏళ్ల తరబడి కొనసాగుతూ 2640లో ముగియనుంది. ఈ సంగీతాన్నే నెమ్మదిగా వాయించేందుకు కొందరు సంగీతకళాకారులు గతంలో ప్రయత్నించారు. 2009లో డయానే లుచీస్ అనే సంగీత కళాకారుడు ఈ సంగీతాన్ని 14 గంటల 56నిమిషాలు వాయించాడు. అదే ఏడాది మరొకరు 9-12 గంటలపాటు వాయించారు. కానీ, ఒక సంగీతాన్ని 639 సంవత్సరాలు వాయించడమనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
DGP Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసిన ఈసీ
-
Assembly election Results: మూడు రాష్ట్రాల ఫలితాలు.. ప్రముఖుల గెలుపోటములు ఇలా..!
-
Chhattisgarh Election Results: ఛత్తీస్‌గఢ్‌లో మోదీ మ్యాజిక్‌తో భాజపా జోరు
-
Telangana Election Results: తెలంగాణ ‘హస్త’గతం ఇలా..!
-
Assembly Election Results: మూడు రాష్ట్రాల్లో భాజపా జోరు.. ట్వీట్ చేసిన మోదీ
-
KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా