టెలీమెడిసిన్‌ సేవల్లో కొత్త మైలురాయి

కేంద్ర ప్రభుత్ ‘ఈసంజీవని టెలీమెడిసిన్‌’ సేవలు ఓ కొత్త మైలురాయిని చేరుకున్నాయి.

Published : 15 Dec 2020 00:19 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఈ-సంజీవని టెలీమెడిసిన్‌’ సేవలు ఓ కొత్త మైలురాయిని చేరుకున్నాయి. ఈ విధానంలో ప్రజలు పొందిన వైద్య సలహాల సంఖ్య సోమవారం నాటికి పదిలక్షలకు పైగా దాటాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఆన్‌లైన్‌లో వైద్య సలహాలను అందించే ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో ఈ సంజీవనిని వాడుతున్నారు. సగటున రోజుకు 14,000 వైద్య సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. దీనిలో భాగంగా వైద్యులు తమలో తాము చర్చించుకునే వీలు కూడా ఉంది. ఈ విధంగా దేశంలో ఆరువేల ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు అనుసంధానమై ఉన్నాయి.

ఇంటర్నెట్‌ ఆధారంగా ఆరోగ్య సేవలను అందించటం ద్వారా ప్రజల డబ్బు, సమయాన్ని ఆదా అవ్వడమే కాకుండా వారికి మెరుగైన సేవలు అందేందుకు దోహదపడుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ విధమైన అన్‌లైన్‌ వైద్యసేవల కార్యక్రమం లభించటం భారత్‌లోనే తొలిసారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది జాతీయ ఆరోగ్య వ్యవస్థ మెరుగుదలకు ఉపయోగపడిందని వివరించింది. ఈ సేవలను అధికంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఉపయోగిస్తుండటం గమనార్హం. ఒకసారి ఈ సేవలను ఉపయోగించిన వారిలో నాలుగో వంతు మంది మళ్లీ సలహాల కోసం రావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని