పాదం.. పట్టించుకుంటేనే పదిలం!

వింటర్‌ వచ్చిందంటే చాలు చర్మ సంరక్షణ కోసం తంటాలు పడాల్సి వస్తుంది. ఇక ఈ సమయంలో పాదాలు పగిలితే.. ఆ బాధను అస్సలు భరించలేం. చర్మంపై తేమ త్వరగా ఆరిపోతుండటంతో పాదాల్లో పగుళ్లు వస్తాయి. ఇప్పటికే పగుళ్లు ఉన్నట్లయితే అవి మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి.

Published : 21 Dec 2020 22:22 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: వింటర్‌ వచ్చిందంటే చాలు చర్మ సంరక్షణ కోసం తంటాలు పడాల్సి వస్తుంది. ఇక ఈ సమయంలో పాదాలు పగిలితే.. ఆ బాధను అస్సలు భరించలేం. చర్మంపై తేమ త్వరగా ఆరిపోతుండడంతో పాదాల్లో పగుళ్లు వస్తాయి. ఇప్పటికే పగుళ్లు ఉన్నట్లయితే అవి మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. మరి పాదాలను పదిలంగా చూసుకోవాలంటే? కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా పగుళ్ల బాధ నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు.

* ముఖ్యంగా పాదాల్లో మురికి చేరకుండా చూసుకోవాలి. గోళ్లను తరచుగా కత్తిరించుకోవాలి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి అందులో అరగంట పాటు పాదాలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉండే మృత కణాలు తొలగిపోతాయి. పాదాల్లో మురికి చేరకుండా ఉంటుంది. 

ఒక బకెట్‌లో పావుభాగం వరకు నీరు తీసుకుని అందులో కొబ్బరి నూనె, విటమిన్‌ ఈ నూనె, వంట సోడాలను ఒక్కొక్క స్పూన్‌ చొప్పునా వేయాలి. అందులో అరగంట పాటు కాళ్లను ఉంచాలి. ఈ విధంగా చేయటం వల్ల పాదాల్లో పగుళ్ల బాధలు తొలగిపోతాయి.

బాదం నూనె, ఆలివ్‌ నూనె, కొద్దిగా యూకలిప్టస్‌ నూనెలను కలిపిన మిశ్రమాన్ని తరచూ పాదాలకు పట్టించాలి. తద్వారా పాదాలు మృదువుగా మారతాయి. 

ముల్తానీ మట్టిలో గులాబీ నీరు కలిపి పాదాలకు పూత వేసి, పావుగంట తరువాత కడగాలి. అనంతరం మాయిశ్చరైజర్‌ రాయాలి. తరచూ ఇలా చేయటం వల్ల చర్మం మీద మృత కణాలు తొలగిపోతాయి. పగుళ్ల బాధలు తగ్గుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని