ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వానికి నోటీసులు

ఎమ్మెల్సీలుగా గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ నియామకంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముగ్గురు ఎమ్మెల్సీల నియామకాన్ని సవాలుచేస్తూ...

Published : 23 Dec 2020 19:18 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్సీలుగా గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ నియామకంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముగ్గురు ఎమ్మెల్సీల నియామకాన్ని సవాలుచేస్తూ సామాజిక కార్యకర్త ధనగోపాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. గవర్నర్‌ కోటాలో గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్‌ ఎమ్మెల్సీ పదవులు పొందగా.. వివిధ రంగాల్లో నిష్ణాతులను గవర్నర్‌ కోటాలో నియమించాలన్న నిబంధన పాటించలేదని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వంలోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలను హైకోర్టు ఆదేశించింది.

ఇవీ చదవండి...

బిక్కవోలులో సత్యప్రమాణం చేసిన నేతలు

బెంగాల్‌లో ఫిరాయింపుల జోరు!
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని