‘అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు’

రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు, రౌడీషీట్లు తెరిచే పరిస్థితి వచ్చిందని పలువురు న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద దంపతుల హత్య హేయమైన చర్యగా వారు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతులు దారుణహత్యకు..

Published : 21 Feb 2021 01:21 IST

హైకోర్టు న్యాయవాదుల బృందం ఆరోపణ

పెద్దపల్లి: రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు, రౌడీషీట్లు తెరిచే పరిస్థితి వచ్చిందని పలువురు న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద దంపతుల హత్య హేయమైన చర్యగా వారు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతులు దారుణహత్యకు గురైన కల్వచర్లలోని ఘటనాస్థలిని హైకోర్టు న్యాయవాదుల బృందం శనివారం పరిశీలించింది. నడిరోడ్డుపై హత్య జరిగితే.. ఓ గ్రామంలో జరిగిన తగాదాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్య కేసు విచారణను సీబీఐ చేపట్టాలని ప్రభుత్వమే లేఖ రాయాలని వారు డిమాండ్‌ చేశారు.

గుంజపడుగుకు 300మంది న్యాయవాదులు

హైదరాబాద్‌ నుంచి 300 మంది న్యాయవాదుల బృందం రేపు న్యాయవాది వామన్‌రావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గుంజపడుగుకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 7గంటలకు నగరంలోని ఎల్బీనగర్‌ నుంచి ఈ బృందం బయలుదేరనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని