
Published : 14 Aug 2020 15:15 IST
ప్రణబ్ కళ్లు స్పందిస్తున్నాయి
కుమార్తె శర్మిష్ఠ వెల్లడి
దిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కొద్దిగా మెరుగైనట్లు ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ తెలిపారు. ‘‘క్లిష్టమైన వైద్య పరిభాషలో కాకుండా, నాకు అర్థమైనదేమంటే గత రెండురోజులుగా మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉన్నప్పటికీ.. అది మరింత దిగజారలేదు. వెలుతురుకు ఆయన కళ్లు కొద్దిగా ప్రతిస్పందిస్తున్నాయి.’’ అని ఆమె తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.
మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈనెల 10న ఆసుపత్రిలో చేరిన ప్రణబ్‌కు సోమవారం శస్త్రచికిత్స చేశారు. అయితే మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రణబ్ కొవిడ్-19తో కూడా బాధపడుతున్నట్టు పరీక్షల్లో తేలింది. గురువారం కూడా ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నట్టు తెలియవచ్చింది. అయితే ప్రణబ్ ఆరోగ్యంపై వస్తున్న వివిధ పుకార్లను కుమారుడు అభిజిత్, శర్మిష్ఠ ఖండించారు.
Tags :