రూ.35కే కిలో ఉల్లిగడ్డలు: నిరంజన్‌రెడ్డి

ఉల్లిధరలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం వ్యాపారులు నిల్వ చేసే పరిమితులపై ఆంక్షలు విధించింది...

Published : 25 Oct 2020 02:18 IST

హైదరాబాద్‌: ఆకాశాన్ని అంటిన ఉల్లిధరలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం వ్యాపారులు నిల్వ చేసే పరిమితులపై ఆంక్షలు విధించింది. రాష్ట్రం ప్రభుత్వం రాయితీపై ఉల్లి సరఫరా చేపట్టింది. జంటనగరాల్లోని 11 రైతుబజార్లలో రూ.35కే కిలో ఉల్లిగడ్డలు సరఫరా చేస్తున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఉల్లిధరల నియంత్రణ కోసం మార్కెటింగ్‌ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి వ్యక్తికీ 2 కిలోల చొప్పున ఉల్లి విక్రయిస్తామన్నారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి తీసుకోవచ్చని తెలిపారు. భారీ వర్షాలకు దేశ వ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతినగా.. లాభంలేకుండా రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అమ్మకాలు చేపట్టామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బహిరంగమార్కెట్లో ఉల్లి రూ.90 పలుకుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని