సబ్బుపై శివుడి రూపం 

కార్తిక మాసంలో వచ్చే పౌర్ణమి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజు. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలోనే ఈ పర్వదినం వస్తుంది. దీనికే శరత్‌ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అనే పేర్లూ ఉన్నాయి. ఈ పర్వదినాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు భక్తులు. ఉపవాస దీక్ష తీసుకుని శివ నామస్మరణ చేస్తుంటారు.

Published : 30 Nov 2020 23:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కార్తిక మాసంలో వచ్చే పౌర్ణమి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజు. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలోనే ఈ పర్వదినం వస్తుంది. దీనికే శరత్‌ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అనే పేర్లూ ఉన్నాయి. ఈ పర్వదినాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు భక్తులు. ఉపవాస దీక్ష తీసుకుని శివ నామస్మరణ చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం శివుడి పై ఉన్న భక్తిని వినూత్న రీతిలో చాటాడు. సబ్బుపై శివుని ఆకృతిని రూపొందించాడు. ఈ ఆవిష్కరణ చేసిన ఆ శివభక్తుడే తూర్పు గోదావరి జిల్లా రంగం పేటకు చెందిన దేవిన శ్రీనివాస్‌. కార్తిక పౌర్ణమి రోజున ఈ ప్రతిమను రూపొందించాడు. సబ్బుపై శివుని ఆకృతిని ఆవిష్కరించటానికి దాదాపు మూడు గంటలు శ్రమించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని