
దసరా నాటికి 3,200ఇళ్ల నిర్మాణం పూర్తి: తలసాని
హైదరాబాద్: హైదరాబాద్‌లో దసరా నాటికి మరో 3,200 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాప్ యాదవ్ వెల్లడించారు. దసరా కానుకగా నగరంలోని 21 ప్రాంతాల్లో సుమారు 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసబ్ ట్యాంకులోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం నగరంలో 1,144 ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో రూ.812 కోట్ల వ్యయంతో 7,455 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.