అంగారకుడిపై ఆ జంతువు: నాసా ‘చిత్రాలు’!

ఈ చిత్రాల్లోని ప్రదేశం పురాణాలకు సంబంధించిన ఓ జంతువు మాదిరిగా ఉందని కూడా ప్రకటించింది.

Published : 29 Aug 2020 22:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అరుణ గ్రహం అని మనం పిలుచుకునే అంగారకుడంటే అంతరిక్ష ప్రేమికులకు ఎంతో ఆసక్తి. మనిషికి చంద్రుడి తర్వాత అంత ఆకర్షణీయమైన గ్రహం ఇదేనంటే అతిశయోక్తి కాదు. కాగా, అరుణ గ్రహానికి చెందిన కొన్ని తాజా చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. అంతేకాదు.. ఈ చిత్రాల్లోని ప్రదేశం డ్రాగన్‌ పోలి ఉందని కూడా ప్రకటించింది.

ఇందుకు సంబంధించిన చిత్రాలను ట్విటర్‌లో షేర్‌ చేసిన నాసా ‘‘మా మార్స్‌ రికొన్నాయిసెన్స్‌ ఆర్బిటార్‌కు చెందిన హైరైజ్‌ కెమెరా.. అంగారకుడిపై ఓ డ్రాగన్‌ మెలాస్‌ ఛాస్మా లోయను కాపలా కాస్తున్నట్టు ఉన్న కొన్ని చిత్రాలను పంపింది. ఈ చిత్రం ఉన్న ప్రదేశం సుమారు ఓ కిలోమీటరు పొడవుంటుంది.’’ అని దాని గురించి వివరించింది. కాగా, అంతరిక్ష ప్రేమికులను ఎంతో అలరిస్తున్న ఈ చిత్రానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని