అత్యాచార ఘటనపై స్పందించిన పవన్‌

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పందించారు

Published : 20 Jul 2020 12:47 IST

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ఘటనక పాల్పడిన మృగాళ్లను కఠినంగా శిక్షించాలని అన్నారు. అత్యాచార నిరోధానికి తీసుకొచ్చిన దిశ చట్టం ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్న ముఠాలను అణచివేయకపోతే మహిళలకు రక్షణ కరవవుతుందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.పేద కుటుంబానికి చెందిన బాలిక పదో తరగతి అనంతరం తల్లికి సాయపడాలని పనులకు వెళ్తే కొందరు వ్యక్తులు చిత్రహింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని