గతేడాది కంటే ఎక్కువ ధరకే అమ్మారు

గతేడాదితో పోల్చుకుంటే పంజాబ్‌ రైతులు ఎక్కువ ధరకే వరిని అమ్మారని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రైతులు అపార్థం చేసుకున్నారని ఆయన సోమవారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Published : 30 Nov 2020 20:52 IST

పంజాబ్‌ రైతులపై కేంద్రమంత్రి జావడేకర్‌ ట్వీట్‌

దిల్లీ: గతేడాదితో పోల్చుకుంటే పంజాబ్‌ రైతులు ఎక్కువ ధరకే వరి ధాన్యం అమ్మారని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రైతులు అపార్థం చేసుకున్నారని ఆయన సోమవారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం తరపున ధాన్య సేకరణ కూడా కొనసాగిస్తామని ఆయన ట్వీట్‌లో తెలిపారు. గత పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం రైతుల కోసం 3 చట్టాలను ఆమోదించింది. ఆ చట్టాలు తమకు అన్యాయం చేస్తున్నాయన్న ఆరోపణలతో గత ఐదు రోజులుగా రైతులు దిల్లీని ముట్టడించారు. దీంతో దిల్లీలో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడ్డాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వారిని చర్చలకు ఆహ్వానించినా తిరస్కరించారు.

నిరసన వ్యక్తం చేస్తున్న వారిలో పంజాబ్‌ రైతులు అధికభాగం ఉండగా.. సోమవారం గురునానక్‌ జయంతి సందర్భంగా ‘సిక్కులతో మోదీకున్న అనుబంధం’ పేరిట ఓ పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం. కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌, కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి పాల్గొన్నారు. ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీష్‌, గుర్ముఖి భాషల్లో లభ్యమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని