కూనలతో పులి షికారు.. అరుదైన వీడియో

పులి తన నాలుగు పిల్లల్ని వెంటబెట్టుకుని విహరిస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

Updated : 12 Nov 2020 08:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అడవిలో పులి కనిపించటమే చాలా అరుదు. అలాంటిది ఓ పులి తన నాలుగు పిల్లల్ని వెంటబెట్టుకుని విహరిస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అపురూపమైన ఈ వీడియోను ఓ అటవీశాఖ ఉన్నతాధికారి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీనిని ఉత్తర్‌ ప్రదేశ్‌లోని దూధ్వా టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో తీసినట్టు ఆయన వివరించారు. అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న తల్లి పులిని, దాని వెంట ఉన్న పులికూనలను ఈ వీడియోలో చూడవచ్చు. అనంతరం తన పిల్లలను తీసుకుని అది చీకటిలో మరోవైపుకు వెళ్లిపోయింది. జంతు ప్రేమికులు, నెటిజన్లు మిస్‌ కాకూడదని భావిస్తున్న ఈ వీడియోను మీరూ చూసేయండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని