అధికారుల నిర్వాకం:‘నీట్‌’కు విద్యార్థిని దూరం

నిర్వాహకులు చేసిన తప్పిదానికి ఓ విద్యార్థిని జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్)’ పరీక్ష రాయకుండా కన్నీళ్లతో వెనుదిరగాల్సి వచ్చింది.

Published : 13 Sep 2020 16:10 IST

సుబేదారి(హన్మకొండ): నిర్వాహకులు చేసిన తప్పిదానికి ఓ విద్యార్థిని జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్)’ పరీక్ష రాయకుండా కన్నీళ్లతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన వరంగల్‌ పరిధిలోని హన్మకొండలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన నిఖాత్‌ ఫాతిమా అనే విద్యార్థిని నీట్‌ పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులతో కలిసి అద్దె కారులో హన్మకొండ వచ్చింది. హాల్‌ టికెట్‌లో పరీక్షాకేంద్రం అడ్రస్‌ ఏవీవీ కళాశాల, వరంగల్‌ అని ఉండటంతో అక్కడికి వెళ్లింది. అయితే అక్కడ పరీక్షా కేంద్రం లేదని తెలియడంతో కంగుతింది. అధికారుల తప్పిదంతోనే తాను పరీక్ష రాయలేకపోయానంటూ అక్కడి నుంచి కన్నీళ్లతో వెనుదిరిగింది. అనంతరం తనకు న్యాయం చేయాలని కోరుతూ హన్మకొండలోని సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో నిఖాత్‌ ఫాతిమా పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని