రాఖీ పండుగ.. కరోనా వారియర్స్‌తో

రాఖీ పండుగను పురస్కరించుకొని సైకతశిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ కరోనా వారియర్స్‌ను ప్రతిబింబించేలా ఇసుకతో పూరి తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు.

Updated : 29 Nov 2023 12:24 IST

భువనేశ్వర్‌: రాఖీ పండుగను పురస్కరించుకొని సైకతశిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ కరోనా వారియర్స్‌ను ప్రతిబింబించేలా ఇసుకతో పూరి తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న కరోనా వారియర్స్‌ను రాఖీ పండుగ సందర్భంగా గుర్తు చేసుకోవాలని పట్నాయక్‌ అన్నారు. రాఖీ పండుగ కరోనా వారియర్స్‌తో అనే నినాదాన్ని సైకత శిల్పంపై ఉంచారు. 
     కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు కృషి చేస్తున్నారు. కొందరు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. గతంలో  వైద్య సిబ్బంది సేవల్ని ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం పూలవర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో సుదర్శన్‌ పట్నాయక్‌ గీసిన చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని