‘చిత్రం’ చెప్పే విశేషాలు

ఉదయ్‌పూర్‌లో జరగబోతున్న నిహారిక-చైతన్యల పెళ్లితంతు కోసం అల్లు కుటుంబ సభ్యులంతా బయలుదేరారు. ప్రైవేటు విమానంలో కుటుంబ సమేతంగా వేడుక కోసం పయనమయ్యారు. చాలా ఏళ్ల తర్వాత ఫ్యామిలీ

Updated : 07 Dec 2020 22:11 IST

వెల్‌కమలం

కాంగ్రెస్‌ ప్రచారకమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి భాజపాలో చేరారు. దిల్లీలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆమెకు కాషాయ కండువా కప్పారు. అరుణ్‌ సింగ్‌ సభ్యత్వం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు.    


ఖమ్మంలో ఐటీ హబ్‌

తెలంగాణలోని ప్రతి దిక్కుకూ ఐటీ రంగాన్ని విస్తరించే ప్రక్రియలో భాగంగా ఖమ్మంలో నూతన ఐటీ సౌధాన్ని మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, పువ్వాడ అజయ్‌, ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. దీనితోపాటు మినీ ట్యాంక్‌బండ్‌, నూతన పోలీస్‌ కమిషనరేట్‌, వైకుంఠధామం వంటి పలు అభివృద్ధి పనులను ఆవిష్కరించారు.  


బిడ్డ పెండ్లికి రండి సారూ..!

 తెలంగాణ ఉద్యమ సమయంలో తన పొలం నుంచే పోరాట గళం వినిపించిన రైతు ఫణికర మల్లయ్య సీఎం కేసీఆర్‌ను కలిశారు. తన కుమార్తె పెళ్లి శుభలేఖను ముఖ్యమంత్రికి అందజేసి వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు.    
 


అల్లు వారు రెడీ

ఉదయ్‌పూర్‌లో జరగబోతున్న నిహారిక-చైతన్యల పెళ్లితంతు కోసం అల్లు కుటుంబ సభ్యులంతా బయలుదేరారు. ప్రైవేటు విమానంలో కుటుంబ సమేతంగా వేడుక కోసం పయనమయ్యారు. చాలా ఏళ్ల తర్వాత ఫ్యామిలీ మొత్తం విమానంలో ప్రయాణిస్తున్నామని, పెళ్లి సంబరం మొదలైందని అల్లు అర్జున్‌ ఫొటోలు షేర్‌ చేశారు.


సైనికుల త్యాగాలు అజరామరం

విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరుల కుటుంబాలకు సాయంగా గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నగదు పురస్కారాన్ని అందజేశారు.    
 


మహాసముద్రం మొదలైంది

అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మహాసముద్రం’ అదితి రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ నాయికలు. లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం ప్రారంభమైంది.    
 


గుర్తుందా శీతాకాలం

సత్యదేవ్‌ కంచర్ల, తమన్నా భాటియా జంటగా తెరకెక్కుతున్న నూతన చిత్రం గుర్తుందా శీతాకాలం. ఈ చిత్రానికి సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించారు.    
 


గోదానం మహాపుణ్యం

గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. హిందూ ధర్మ రక్షణ కోసం తితిదే ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమానికి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని కోరారు. తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణ శాల నేతృత్వంలో అమలు చేయనున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని సోమవారం విజయవాడ కనక దుర్గ ఆలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలసి ఆయన ప్రారంభించారు. 
 


విరిగిపడ్డ కొండ చరియలు

తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగి పడ్డాయి. బురేవి తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో తేమ చేరి రోడ్డుపై జారి పడుతున్నాయి. ఈ ఘటనలో ఎటువంటి వాహన ప్రమాదం జరుగలేదు. అధికారులు వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు.    
 


సీత వచ్చేసింది..!

రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లోకి నటి ఆలియాభట్‌ తాజాగా అడుగుపెట్టారు. రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా సీతగా చెర్రీ సరసన సందడి చేయనున్నారు. షూటింగ్‌లో భాగంగా జక్కన్నతో ఆలియా సంభాషిస్తున్న కొన్ని ఫొటోలను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.    
 


  ఉప రాష్ట్రపతి రాక

భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం విశాఖ చేరుకున్నారు. ఏడు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చిన ఆయనకు ప్రభుత్వం తరపున జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.      
 


పెళ్లి వారమండీ

‘నిహారిక-చైతన్యల వివాహం మరో రెండురోజుల్లో ఉదయ్‌పూర్‌లో జరగనుంది. దీంతో సోమవారం ఉదయం వధూవరులు, వారి కుటుంబసభ్యులు ప్రైవేటు విమానంలో ఉదయ్‌పూర్‌కు పయనమయ్యారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని వరుణ్‌తేజ్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు’    


పవన్‌ రైతు దీక్ష

రైతాంగానికి పరిహారంగా రూ.35వేలు, తక్షణ సాయంగా రూ.10వేలు ఇవ్వాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు సోమవారం దీక్ష చేపట్టారు. హైదరాబాదులోని తన నివాసంలో ఉదయం పదిగంటలకు ఆయన దీక్షలో కూర్చున్నారు.    


రైతు ఘోష

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో ఆదివారం రైతులపై జరిగిన రాళ్ల దాడిని నిరసిస్తూ తుళ్లూరులో రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. రాత్రంతా వీళ్లు రహదారిపైనే నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసిన శిబిరాన్ని తొలగించబోమని రైతులు స్పష్టంచేస్తున్నారు. దాడికి వ్యతిరేకంగా ఇవాళ రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.    


కార్తిక కిరణం

కార్తిక మాసం శుభ సోమవారం రోజున శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. రాజమండ్రి ఫుష్కరఘాట్‌లలో మహిళా భక్తులు దీపాలను పవిత్ర గోదావరి నదిలో వదిలారు. కేదారేశ్వరుని నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని