గ్రేటర్‌ పోరులో 1,889 నామినేషన్లు

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన ఈ ప్రక్రియలో పెద్ద

Updated : 20 Nov 2020 20:47 IST

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు గాను వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన 1,421 మంది అభ్యర్థులు 1,889 నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ చివరి రోజు కావడంతో ఒక్కరోజే 1,223 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా నుంచి 400పైగా నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం నామినేషన్లలో తెరాస (424), భాజపా(428), కాంగ్రెస్‌ (275), ఎంఐఎం (58), తెదేపా (155), సీపీఐ (12), సీపీఎం (17 ) నామినేషన్లు దాఖలు చేశాయి. గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 66, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 454 నామినేషన్లు దాఖలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని