భద్రగిరి..ఇల ‘వైకుంఠ’పురి 

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వేళ గరుడ వాహనం అధిరోహించి శ్రీ మహావిష్ణువు భువికి వస్తాడని భక్తుల నమ్మకం. మూడు కోట్ల ఏకాదశులతో

Published : 17 Dec 2020 23:01 IST

 

భద్రాచలం : సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వేళ గరుడ వాహనం అధిరోహించి శ్రీ మహావిష్ణువు భువికి వస్తాడని భక్తుల నమ్మకం. మూడు కోట్ల ఏకాదశులతో సమానంగా భావించే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆ భద్రాద్రి భక్తాద్రిగా మారగా... ఆ రామచంద్రుడు మూడోరోజు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బేడా మండపంలో స్వామివారిని అలంకరించిన అర్చకులు అభిషేకాలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామయ్య దర్శనం కోసం పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని